జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

మహబూబ్‌నగర్‌ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్త జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులు నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ సమావేశంలో మంత్రి జర్నలిస్టులకు సరుకులను అందజేశారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 210 మంది జర్నలిస్టులకు జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. 25 కేజీల రైస్‌ బ్యాగ్‌, ఇతర సరుకులను అందజేశారు.